NTV Telugu Site icon

DAP Prices: రైతులకు షాక్.. జనవరి నుంచి పెరగనున్న డీఏపీ ధర

Dap

Dap

DAP Prices: రైతులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈసారి డై–అమ్మోనియం ఫాస్ఫేట్‌ (DAP) ధర జనవరి నుంచి పెరిగే అవకాశం ఉంది. 50 కిలోల బ్యాగ్‌పై సుమారు 200 రూపాయల వరకు పెరగనుందని సమాచారం. అయితే, డీఏపీ దిగుమతులకు కేంద్రం ఇప్పటి వరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు డిసెంబర్‌తో ముగియడంతో.. దీని పొడిగింపుపై మోడీ సర్కార్ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. అంతేకాదు, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్రమంగా పడిపోతుంది.

Read Also: Jairam Ramesh: రూపాయి పతనంపై మోడీ ఎందుకు స్పందించట్లేదు

ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయం పెరగడంతోనే డీఏపీ ధర పెరిగే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఫాస్ఫేటిక్‌ ఎరువుల్లో 90 శాతం వరకు దిగుమతి అవుతున్నాయి. దేశంలో ఏటా 100 లక్షల టన్నుల డీఏపీ వినియోగిస్తుండగా.. అందులో 60 లక్షల టన్నుల వరకు ఇంపోర్ట్ అవుతుంది. ఇక, దేశీయ ఉత్పత్తికి వినియోగించే ముడి పదార్థాలైన రాక్‌ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ను కూడా భారత్ దిగుమతి చేసుకుంటుంది.

Read Also: PSLV-c60: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ 60.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలు!

కాగా, రైతులకు డీఏపీ ధరను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కేంద్రం దిగమతులపై టన్నుకు రూ.3,500 ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ఈ గడువు డిసెంబర్‌తో 31తో అయిపోయింది. ఈ ప్రోత్సాహకాల కొనసాగింపుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. దీంతో ప్రస్తుతం 50 కిలోల బ్యాగ్‌ ధర రూ.1,350 ఉండగా, అది 12–15 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే సుమారు రూ.200 వరకు పెరిగి రూ.1,550గా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక, అంతర్జాతీయంగా ధరల పెరుగుదల, చైనా నుంచి ముడి సరుకు సరఫరా తగ్గడం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణా పరమైన సమస్యలు ధరలు పెరుగుదలకు ప్రధాన కారణాలని కేంద్ర సర్కార్ చెప్తుంది.

Show comments