Jarkhand: దళిత బాలికల అపహరణ.. వారం రోజులుగా అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jarkhand: మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సర్వ సాధారణమైపోయాయి. ఈ మధ్య కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దళిత, గిరిజనుల్లోని మహిళల్లో ఈ దాడులు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని నిరోధించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు దళిత బాలికలను కిడ్నాప్ చేసిన దుండగులు.. వారం రోజుల పాటు వారిపై అత్యాచారానికి ఒడిగట్టారు.
Read also: Rishab Shetty : కాంతారా 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి..?
Also Read
జార్ఖండ్ రాష్ట్రం లాతేహర్ జిల్లా బరవాడీహ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే ఇద్దరు దళిత బాలికలు కొంత కాలం నుంచి కనిపించడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ జిల్లా ఎస్పీ దీనిపై విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు బాలికల కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే బాలికలను గార్వా ప్రాంతానికి చెందిన కొందరు దుండగులు కిడ్నాప్ చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ టీంలతో కలిసి దాడులు నిర్వహించారు. అనంతరం బాలికలను దుండగుల చెర నుంచి విడిపించారు. ఈ క్రమంలో పోలీసులతో బాధితులు పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. నలుగురు దుండుగులు తమను కిడ్నాప్ చేశారని చెప్పారు. వారం రోజుల పాటు తమను ఓ ఇంట్లో బంధించారని తెలిపారు. ఆ సమయంలో పలుమార్లు తమపై లైంగిక దోపిడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను అరెస్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!