Rishab Shetty : కాంతారా 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషబ్ శెట్టి ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీలో ఆయన ఎంతగానో పాపులర్ అయ్యారు. ఇక గత ఏడాది ఆయన తెరకెక్కించిన కాంతారా సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంతారా సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా సినిమా లో ఎంతో అద్భుతంగా నటించారు రిషబ్.కాంతారా సినిమాతో రిషబ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తాజాగా రిషబ్ శెట్టి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజున కాంతారా 2 అప్‌డేట్ ను ప్రకటిస్తారని అభిమానులు ఎంతో ఎదురు చూసారు.అయితే తన పుట్టినరోజు ముగింపు వేడుకల్లో రిషబ్ శెట్టి కాంతారా 2 చిత్రం గురించి మాట్లాడటం జరిగింది..‘కాంతారా 2 సినిమా పనులు ఎంతవరకు వచ్చాయో ఆయన చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని ఇక నుంచి లొకేషన్ సెర్చ్ అలాగే ఆర్టిస్ట్ ఎంపిక కూడా జరుగుతుందని ఆయన తెలిపారు.. ఆ తర్వాత షూటింగ్ అప్డేట్ హోంబాలే ఫిలింస్ అధికారికం గా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు..
కాంతారా 2 చిత్రాన్ని ఈ సంవత్సరమే చిత్రీకరించి 2024లో విడుదల చేస్తాం’ అని రిషబ్ తెలిపారు. అదే సమయంలో కాంతార సీక్వెల్ పై వస్తోన్న పుకార్లను అస్సలు నమ్మవద్దని ఆయన సూచించారు.తన పుట్టిన రోజు వేడుకల గురించి మాట్లాడుతూ.. ‘నేను నాకు పుట్టినరోజు వేడుకను చేసుకోవాలని ఆలోచన లేదు. బెంగళూరు వచ్చినప్పటి నుంచి పుట్టినరోజులు జరుపుకుంటున్నాను. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా పుట్టినరోజున కూడా పని చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే ఈసారి అభిమానులను కలవాలి అని అనుకున్నాను ’ అని రిషబ్ చెప్పుకొచ్చారు.కాంతారా సినిమా తరువాత ఎంతో మందిని కలవడం కుదరలేదు. నా సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణం ప్రేక్షకులు. వారి ఋణం ఎప్పటికి తీర్చుకోలేను నా పుట్టినరోజు సందర్బం గా వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రిషబ్ తెలిపారు.
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!