NTV Telugu Site icon

Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యాసంస్థలు బంద్‌, విమాన రాకపోకలకు అంతరాయం

Fengal

Fengal

Cyclone Fengal: తమిళనాడు ప్రజలను ఫెంగల్ తుఫాన్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. హిందు మహా సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శుక్రవారం నాడు తుఫానుగా మారింది. దీంతో ఈరోజు ( నవంబర్ 30) పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాగే ఛాన్స్ ఉంది. కారైకాల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో నేటి మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు ఐఎండీ తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది.

Read Also: Actress Sridevi: శ్రీదేవి మరణంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సినీ రచయిత

కాగా, పుదుచ్చేరి, చైన్నె, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా.. వేలూరు, తంజావూరు, నాగపట్నం, రాణిపేట, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, పెరంబలూరు, అరియలూర్, కారైకల్ జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Read Also: Wayanad: నేడు వయనాడ్కు ప్రియాంక, రాహుల్.. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

ఇక, తమిళనాడులో ఎలాంటి విపత్తు వచ్చిన తక్షణం బాధితులను ఆదుకునేందుకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తుండటంతో పాటు కారైక్కాల్‌– మహాబలిపురం మధ్య తీరాన్ని ఫెంగల్‌ తుఫాన్ తాకనుండడంతో ఇక్కడి గ్రామీణ, తీర ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. అయితే, ఈ సెక్లోన్ కారణంగా భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది.

Read Also: Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతిపోగొట్టిన నేషనల్ క్రష్

అయితే, పుదుచ్చేరి, తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, మైలాడుతురై జిల్లాల్లో ఈ రోజు మూతపడ్డాయి. ఇక, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కంపెనీలను కోరారు. అలాగే, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో అటు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. చెన్నై నుంచి రాకపోకలు కొనసాగించే పౌర విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది.

Show comments