Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు (బుధవారం) తుఫానుగా మారుతుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చరిలకు భారత వాతవావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొనింది. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో బుధ, గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచించింది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనింది.
Read Also: Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరనేది నేడు తేలనుంది..?
ప్రస్తుతం ఈ తుఫాన్ తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుఫాన్ దగ్గరగా రానున్నట్లు ఐఎండీ సూచనలు జారీ చేసింది. ఇక, తమిళనాడులోని తిరుచ్చి, రామనాథపురం, నాగపట్నం, కడలూరు, విల్లుపురం, తిరువళ్లూరు జిల్లాల్లో వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.