NTV Telugu Site icon

Cyclone Dana: దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశా, బెంగాల్లో రైలు, విమాన సేవలకు అంతరాయం..

Dana

Dana

Cyclone Dana: దానా తుపాను తీరం దాటక ముందే ఒడిశా సర్కార్ అలర్ట్ అయింది. అలాగే, ఒడిశాలోని అనేక తీర జిల్లాల నుంచి సుమారు 10 లక్షల మందిని తరలించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దానా తుపాను.. ఈరోజు (గురువారం) లేదా రేపు (శుక్రవారం) భిటార్కనికా, ధమ్రా మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. కాగా, 120 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను ఒడిశాలోని సగం జనాభాపై తీవ్ర ప్రభావం చూపే ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also: Custard Apple: సీతాఫలం పండ్లు తింటే శరీరానికి ఎంత మేలు తెలుస్తుందో తెలుసా?

మరోవైపు, దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు ఉదయం వరకు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది. ఈ తుపాన్ బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 330 కిలో మీటర్ల దూరంలో, ధమ్రా (ఒడిశా)కి 360 కిలో మీటర్ల దక్షిణ-ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ-ఆగ్నేయంగా 420 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Read Also: Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్‌బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్

ఇక, ఈ దానా తుపాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా , పశ్చిమ మెదీనీపూర్, ఝర్‌గ్రామ్, కోల్‌కతా, హౌరా , హుగ్లీ జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా ఎయిర్ పోర్టు నేటి సాయంత్రం 6 గంటల నుండి రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, భువనేశ్వర్ విమానాశ్రయం నేటి సాయంత్రం 5 నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. ఇక, దానా తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల మీదుగా నడిచే దాదాపు 200 రైళ్లను రైల్వేశాఖ క్యాన్సిల్ చేసింది.