Cyclone Akvan: నెమ్మదిగా కదులుతున్న “అక్వాన్ తుఫాన్”.. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!
- గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతున్న అక్వాన్ తుఫాన్..
- నవంబర్ 20న ఏపీ తీరాన్ని తాకే అవకాశం..
- నెమ్మదిగా కదిలే తుఫానులతో డేంజర్ అంటున్న శాస్త్రవేత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ (Cyclone Akvan) నెమ్మదిగా కదులుతోంది. ఇటీవల వచ్చని అర్నాబ్, మురాసు తుఫానులతో పోలిస్తే దీని కదిలే వేగం తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. సాధారణంగా తుఫానులు వేగంగా, నెమ్మదిగా కదలడం దాని విధ్వంసక శక్తిని నేరుగా నిర్ణయించదు. కానీ తుఫాను నెమ్మదిగా కదలడం వల్ల ఒకే ప్రాంతంలో ఎక్కువ సేపు వర్షాలు కురిసి ముప్పు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నవంబర్ 20న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తుఫాన్ తాకే అవకాశం ఉంది. ఏపీతో పాటు ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుంది.
నెమ్మదిగా కదలడం ప్రమాదమా..?
తుఫానులు వేగంగా, నెమ్మదిగా కదలడంపై వాతావరణ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. 2021లో ‘జర్నల్ ఆఫ్ హైడ్రోమెటియరాలజీ’లో ప్రచురితమైన ఓ అధ్యయనం 2010 నుంచి 2019 మధ్య తీరాన్ని దాటిని 280 ఉష్ణమండల తుపానులను పరిశీలించింది.
Also Read
- Jain Monkhood: రూ.15 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసం.. ఒకే కుటుంబంలో నలుగురి నిర్ణయం!
- Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
- ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
- UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
ఈ తుఫానులు అవి కదిలే వేగానికి, దీని ద్వారా సంభవించిన వరదల తీవ్రతకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. నెమ్మదిగా కదిలే తుఫానులు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువ సేపు వర్షం పడేందుకు కారణమవుతాయి. తుఫాను తీరం దాటాకా మరో ప్రాంతానికి త్వరగా వెళ్లిపోకుండా ఎక్కువసేపు ఒకే ప్రాంతంలో కొనసాగడం వల్ల భారీ వర్షాలు పడి, వరదలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
వేగంగా కదిలే తుఫానుల్లో వర్షపాత ఎక్కువనా..?
ఇదిలా ఉంటే, 2022లో నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన మరో పరిశోధన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 2001 నుంచి 2020 మధ్య ఉపగ్రహాల ద్వారా సేకరించిన వర్షపాత సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఈ అధ్యయనం ప్రకారం.. ఉష్ణమండల తుపానులు ముందుకు కదిలే వేగం పెరిగే కొద్దీ వాటిలో సగటు వర్షపాతం రేటు కూడా పెరిగింది. వేగంగా కదిలే తుపానుల్లో సగటున వర్షపాతం రేటు, నెమ్మదిగా కదిలే తుపానులతో పోలిస్తే 24 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అత్యంత తీవ్రమైన తుపానుల్లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది.
వరసగా మూడు తుఫానులు, ఎల్ నినో కారణమా..?
ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) ప్రకారం..ఆగస్టులో పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో వాతావరణ దృగ్విషయం మరింత బలపడింది. డిసెంబర్ నాటికి ఇది అత్యంత బలమైన స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం గతంతోనూ ఆంధ్రప్రదేశ్‌లో తుఫానుల సంఖ్యపై కనిపించింది. 1976, 1987 సంవత్సరాల్లో ఒక్క నెల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ మూడు తుపానులను ఎదుర్కొంది. ఆ రెండు సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావంలో ఉంది.
తాజావార్తలు
-
Cyclone Akvan: నెమ్మదిగా కదులుతున్న “అక్వాన్ తుఫాన్”.. మరింత డేంజర్ అంటున్న సైంటిస్టులు.!
-
Vikalp Tiwari: టీ20ల్లో మరో యువ సంచలనం.. రెండో భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
స్నాప్‌చాట్ కేంద్రంగా హైటెక్ డ్రగ్స్ దందా గుట్టురట్టు.. క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు!
-
Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
-
Jain Monkhood: రూ.15 కోట్ల వ్యాపారాన్ని వదిలి సన్యాసం.. ఒకే కుటుంబంలో నలుగురి నిర్ణయం!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..