CWC Meeting: పాట్నాలో నేడు సీడబ్ల్యూసీ మీటింగ్.. ఓట్ల చోరీ.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- పాట్నాలో నేడు సీడబ్ల్యూసీ మీటింగ్
- ఓట్ల చోరీ.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో తొలిసారి కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల వ్యూహం, ఓట్ల చోరీ, ట్రంప్ సుంకాలు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అక్టోబర్ లేదా నవంబర్లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Typhoon Ragasa: తైవాన్, చైనాలో తుఫాన్ విధ్వంసం.. 17 మంది మృతి
Also Read
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
- Accidnet: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
- Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
స్వాతంత్య్రానంతర కాలంలో బీహార్‌లో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అని ఆ పార్టీ నాయకులు తెలిపారు. పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో బుధవారం ఉదయం 10 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శులు దీపా దాస్ మున్షీ, సయీద్ నాసిర్ హుస్సేన్ సహా అగ్ర కాంగ్రెస్ నాయకుంతా ఈ సమావేశానికి హాజరవుతారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్, మెలానియాకు అవమానం! సడన్‌గా ఆగిన యూఎన్ ఎస్కలేటర్ రైడ్.. వైట్‌హౌస్ సీరియస్
బుధవారం పాట్నాలో జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశంలో ‘‘ఓట్ల చోరీ’, ట్రంప్ సుంకాలు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అంశాలపై చర్చించే అవకాశం ఉందని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ తెలిపారు.
ఈ సమావేశాలకు కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు (శాసన సభ, శాసన మండలి పక్ష నేతలు), సీఈసీ సభ్యులు హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వంశీ చంద్ రెడ్డి హాజరవుతుండగా… ఇక ఏపీ నుంచి షర్మిలా రెడ్డి, రఘువీరా రెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు పాల్గొంటున్నారు.
తాజావార్తలు
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్‌లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
-
Unclaimed Assets Portal: బ్యాంకు ఖాతాలు, బీమా, షేర్లు.. క్లెయిమ్ కాని ఆస్తుల కోసం కేంద్రం కొత్త పోర్టల్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..