Site icon NTV Telugu

CP Radhakrishnan: రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం..

Cp Radhakrishnan

Cp Radhakrishnan

CP Radhakrishnan: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్టప్రతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు.

Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం..

మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 68 ఏళ్ల రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జూలై 21న ఆరోగ్య కారణాలు చెబుతూ, జగ్‌దీప్ ధంఖర్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి, గెలిపించింది.

Exit mobile version