Site icon NTV Telugu

Kerala: మీకంటే ఆవులే నయం.. లెఫ్ట్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు..

Kerala

Kerala

Kerala: కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. పినరయి విజయన్ ప్రభుత్వం కన్నా ఆవులే మేలు అంటూ వ్యాఖ్యలు చేశారు. కేరళలో మంత్రుల కన్నా ఆవులే ప్రజలకు ఎక్కువ సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆవుల వల్ల ప్రజలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు.

Read Also: Bill Gates is in love: లేటు వయసులో ఘాటు ప్రేమలో బిల్‌గేట్స్‌..! ఆమె ఎవరో తెలుసా..?

ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలని జంతు సంక్షేమ బోర్డు చేసిన విజ్ఞప్తిని కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ గురువారం స్వాగతించారు. మీరు ప్రేమికుల రోజు ప్రేమను పంచుకోవచ్చని, దీనిపై ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఆవులను గౌరవించమని మాత్రమే సూచిస్తున్నామని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ రోజున ‘కౌ హగ్ డే’ని జరుపుకోవాలని, ఆవులు భావోద్వేగ సంపద, సామూహిక ఆనందాన్ని ఇస్తాయని యానిమర్ వెల్ఫేర్ బోర్డ్ ఆప్ ఇండియా బుధవారం విజ్ఞప్తి చేసింది. ఆవు భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, మన జీవితాన్ని నిలబెడుతుందని, పశువుల సంపద, జీవవైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఓ ప్రకటనలో తెలియజేసింది. పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తున్న సమయంలో వైదిక సంప్రదాయాలు అంతరించిపోకుండా ఆవులు సహాయపడతాయని అన్నారు.

Exit mobile version