దేశంలో కరోనా కేసులు తీవ్రత పెరుగుతోంది. వరసగా ఇటీవల కాలంలో 15 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత రెండు నెలల కాలం నుంచి రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఢిల్లీల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 20,038 కేసులు నమోదు అయ్యాయి. వరసగా రెండు రోజులుగా 20 వేల కన్నా అధికంగానే కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన ఒక రోజులో కరోనా మహమ్మారి వల్ల 47 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 1,39,073 కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో 16,994 కోవిడ్ నుంచి కోలుకున్నారు. అంతకుముందు రోజుతో పోలిస్తే డైలీ పాజిటివిటీ రేటు తగ్గింది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది. అంతకుముందు రోజు ఇండియాలో 20,139 కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Ts Si Prelims Exam Postponed: ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా..!
కరోనా మొదలైనప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు 5,25,604 మరణించగా..4,30,45350 మంది కరోనా బారినపడి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.31గా ఉండగా.. రికవరీ రేటు 98.49 శాతంగా, డెత్ రేట్ 1.20 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 199,47,34,994 డోసులు టీకాను ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 18,92,969 వ్యాక్సినేషన్ ఇచ్చారు. నేటి నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా బూస్టర్ డోస్ ఇస్తున్నారు.
