NTV Telugu Site icon

COVID 19: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు.. 31 మరణాలు

Corona

Corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు లోపే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన నివేదిక ప్రకారం దేశంలో 24 గంటల్లో కొత్తగా 16,103 కేసులు నమోదు అవ్వగా.. మహమ్మారి బారిన పడి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 13,929 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711గా ఉంది. పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉంది.

Read Also: Hyderabad: బీజేపీ దిగ్గజాలకు నేడు యాదమ్మ చేతి వంటకాలు

కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు మొత్తం 4,34,86,326 కేసులు నమోదు అవ్వగా.. ఇందులో 4,28,65,519 మంది కోలుకున్నారు. 5,25,199 మంది మరణించారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. డెత్ రేట్ 1.21 శాతంగా ఉంది. మరోవైపు కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో వేగవంతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని 80 శాతం పైగా జనాభాకు వ్యాక్సినేషన్ అందించారు. వ్యాక్సినేషన్ కు అర్హులైన వారికి 197,95,72,963 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 10,10,652 మందికి వ్యాక్సినేషన్ చేశారు.