Corona Cases In India: దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత రెండు మూడు రోజులుగా 10 వేల లోపే నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో మరోసారి పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,649 మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు. 36 మంది ప్రాణాలు కోల్పోగా.. 10,677 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.59 శాతంగా ఉండగా.. డైలీపాజిటివిటీ రేటు 2.19 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 96,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.22గా ఉంది.
కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం 4,43,68,195 కరోనా కేసులు నమోదు కాగా.. 4,37,44,301 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 5,27,452 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,10,58,83,682కు చేరింది. నిన్న ఒక్క రోజే 27,17,979 మందికి కరోనా టీకాలు వేశారు. మంగళవారం 4,07,096 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.
Read Also: KL Rahul Marriage: బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెతో కేఎల్ రాహుల్ పెళ్లి ఖరారు.. ఎప్పుడంటే..?
ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వ్యాధి విజృంభణ పెరుగుతోంది. ప్రపంచం మొత్తం మీద కొత్తగా 700,610 కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 60,22,22,965 కరోనా కేసులు నమోదు కాగా.. వీరిలో 6,475,893 మరణించారు. నిన్న ఒక్క రోజే వరల్డ్ వైడ్ గా కరోనా నుంచి 8,66,392 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 57,59,61,246కి చేరింది. ఇదిలా ఉంటే ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా దేశాలకు కరోనా ధడ పుట్టిస్తోంది. ఈ రెండు దేశాల్లో గత కొంత కాలం నుంచి లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. జపాన్ లో 1,85,497 మందికి వైరస్ సోకగా..దక్షిణ కొరియాలో 1,50,098 మంది కరోనా బారిన పడ్డారు.