CORONA CASES IN INDIA:దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత వారం రోజూవారీ కేసుల సంఖ్య సగటున 15 వేలకు పైగా నమోదు అయ్యేది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో కేవలం 9,531 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 36 మంది మరణించారు. 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 97,648కు చేరింది.
దేశంలో కరోనా కేసులు ప్రారంభం అయిన రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు 4,43,48,960 కరోనా కేసులు నమోదు అయితే వీరిలో 4,37,23,944 మంది కోలుకోగా.. మరణించిన వారి సంఖ్య 5,27,368కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.59 ఉండగా.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.22గా ఉంది. రోజూవారీ పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 36 మంది మరణిస్తే ఒక్క కేరళలోనే కరోనాతో 10 మంది చనిపోయారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ నుండి నలుగురు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, మణిపూర్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా నుండి ఇద్దరు చొప్పున మరణించారు.
Read Also: Pakistan: దైవదూషణ చేశాడంటూ హిందువుపై దాడి..
ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 210.02 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 35,33,466 మందికి వ్యాక్సినేషన్ చేశారు. గడిచిన 24 గంటల్లో 2,29,546 పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు మొత్తం 88.27 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసులను పరిశీలిస్తే.. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 5,51,288 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 60,08,28,427 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. 64,71,809 మంది మహమ్మారి వల్ల మరణించారు. 57,50,66,049 మంది కరోనా నుంచి కోలుకున్నారు.