UP Driver: సినిమాల్లోనూ.. రాజకీయ నాయకులు తరచుగా చెప్పే డైలాగ్ గుర్తుందా? ఎంటదని బుర్ర గోక్కుంటున్నారా? అదేనండీ చట్టం తన పని తాను చేసుకు పోతుంది.. చట్టం ముందు అందరూ సమానమే. ఈ డైలాగ్ గుర్తొ్చ్చింది కదా.. ఈ ఘటనను చూస్తే అది నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం అతను డ్రైవర్‌గా ఉన్నప్పుడు జరిగిన ఘటనపై ఇప్పుడు ఆయన 83 ఏళ్ల వయసులో కోర్టు సమన్లు జారీ చేసింది. అందుకే అంటున్నాం.. చట్టం తన పని తాను చేసుకు పోతుందని. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో 1994లో జరిగింది. అపుడు అతను రెండు సార్లు కోర్టుకు వెళ్లి వచ్చాడు.. తరువాత దాని గురించి చడీ చప్పుడు లేదు. 28 సంవత్సరాల తరువాత ఇపుడు కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు..
Read also: Tamannah : రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న తమన్నా..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 83 ఏళ్ల అచ్చన్ రెండు దశాబ్దాల క్రితం డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం అతను పక్షవాతంతో బాధపడుతున్నాడు. సోమవారం ఆయనకు అనుకోకుండా సమన్లు వచ్చాయి. బరేలీ పోలీసుల బృందం అతని బారాబంకి ఇంటికి చేరుకుని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నుండి సమన్లు అందజేశారు. షాక్ తిన్న అచ్చన్ పోలీసులపై విరుచుకుపడ్డాడు. అచ్చన్ స్పందనకు ఎలా స్పందించాలో అర్థంకాని పోలీసులు వృద్ధుడిని కోర్టుకు హాజరుకావాలని కోరారు. లేని పక్షంలో చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
Read also: BMW M 1000 RR Launch: 55 లక్షల విలువైన సరికొత్త బైక్.. గరిష్ట వేగం గంటకు 314 కిమీ!
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అచ్చన్ చెబుతూ 1994లో జరిగిన సంఘటనను చెప్పాడు. అచ్చన్ తాను ఉత్తరప్రదేశ్ రవాణా శాఖలో డ్రైవర్‌గా పనిచేశానని చెప్పాడు. తాను సరుకు తీసుకురావడానికి బరేలీకి వెళ్ళానని… అక్కడి నుండి ఫరీద్‌పూర్‌కి వెళ్ళానని చెప్పాడు. తాను రాత్రి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గేదెల బండి ఒక్కసారిగా మలుపు తిరిగింది. బ్రేకులు పనిచేయలేదు మరియు క్రాష్ అయి గేదె చనిపోయిందని చెప్పాడు. ఆ ఘటన జరిగిన సమయంలో తాను ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు సమాచారం అందించానని ఆయన చెప్పాడు. ఘటన అనంతరం తనకు రెండు పర్యాయాలు సమన్లు అందాయని.. ఆ రెండు సందర్భాల్లో బెయిల్ పొందానని అచ్చన్ చెప్పారు. రెండు దశాబ్దాల తరువాత ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకుందని.. ఇప్పుడు కోర్టుకు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసిందని అచ్చన్ చెప్పారు.