PM Modi: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేసిన పాపాలకు దేశం ఆ పార్టీని శిక్షిస్తోందని, ఒకప్పడు 400 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 300 స్థానాల్లో పోటీ చేయలేకపోయిందని పీఎం మోడీ అన్నారు. మొదటి దశ ఓటింగ్‌లో రాజస్థాన్‌లో సగం మంది ప్రజలు కాంగ్రెస్‌ని శాసించారు, దేశభక్తి నిండిన రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ దేశాన్ని శక్తివంతం చేయదనే విషయం తెలుసని ఆయన అన్నారు. జలోల్ జిల్లాలో జరిగి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Sunita Kejriwal: కేజ్రీవాల్ భార్య సంచలన ఆరోపణలు.. భోజనంపై నిఘా, చంపేందుకు కుట్ర..
2014కి ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలని దేశం కోరుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ ఆశ్రిత పక్షపాతం, అవినీతి చెదపురుగులను వ్యాప్తి చేయడం ద్వారా దేశాన్ని భ్రష్టపట్టించిదని, ఈ రోజు దేశ ప్రజలు కాంగ్రెస్‌పై కోపంతో ఉన్నారని, ఆ పార్టీ చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆపార్టీ ఇప్పుడు 543 సీట్లలో 300 సీట్లకు సైతం పోటీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ అభ్యర్థి లుంబారామ్ చౌదరికి మద్దతుగా ఈ రోజు జలోర్ జిల్లా భిన్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు మొదటిదశలో 12 స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగగా.. మిగిలిన 13 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. దేశం మొత్తం 543 స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
