Covid 19: దేశంలో మరింత తగ్గిన కరోనా.. 50 వేల దిగువకు యాక్టివ్ కేసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
corona cases in india: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 5,554 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 6,322 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 18 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.7 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో పాటు మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.11 గా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల దిగువకు చేరుకుంది. ప్రస్తుతం 48,850 యాక్టివ్ కేసులు ఇండియాలో ఉన్నాయి.
Read Also: Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రకు విరామం.. ఈ రోజు కేరళకు చేరనున్న పాదయాత్ర
Also Read
కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 5,28,139 మంది మరణించగా.. 4,39,13,294 మంది కొవిడ్ బారి నుంచి బయటపడ్డారు. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 4,44,90,283కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 1.47 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.80 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన వారికి 214.77 కోవిడ్ వ్యాక్సినేషన్ డోసులను అందించారు. నిన్న ఒక్క రోజే 21,63,811 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చారు. మొత్తంగా గడిచిన 24 గంటల్లో 3,76,855 కరోనా నిర్థారణ టెస్టులు చేశారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 4,89,469 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 1,667 మరణాలు చోటు చేసుకున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,29,83,335కు చేరుకుంది. మరణాల సంఖ్య 65,14,456గా ఉంది. ప్రస్తుతం జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోలనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ దేశాల్లో లక్షల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!