NTV Telugu Site icon

Dallewal Health Update: మరింత క్షీణించిన రైతు నాయకుడు దల్లేవాల్‌ ఆరోగ్యం..

Dallewale

Dallewale

Dallewal Health Update: పంజాబ్‌- హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ దీక్ష (70) ఈరోజు (జనవరి 6) 42వ రోజుకు చేరుకుంది. దల్లేవాల్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతుంది. కాగా, శనివారం నాడు స్ట్రెచర్‌ పైనుంచే మహా పంచాయత్‌ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాల పాటు ప్రసంగించారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కాగా, ఆదివారం నాటికి దల్లేవాల్‌ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకుంటున్నారని డాక్టర్‌ అవతార్‌ సింగ్‌ తెలిపారు.

Read Also: Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించనున్న ప్రధాని

ఇక, రైతు నాయకుడు దల్లేవాల్ యొక్క మూత్ర పిండాలు కూడా క్రమేపీ పని చేయలేని స్థితికి వచ్చాయని గ్లోమెరులర్‌ ఫిల్ట్రేషన్‌ రేట్‌ను బట్టి తెలుస్తోందని డాక్టర్ అవతార్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని ఎస్‌కేఎం నేతలు చెప్పుకొచ్చారు. తక్షణమే ఆయన దీక్షను విరమించినా కీలక అవయవాలు పూర్తి స్థాయిలో పని చేస్తాయన్న గ్యారెంటీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉండటంతో బరువును కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య సాయం అందించేందుకు పంజాబ్‌ సర్కార్ ముందుకు వచ్చిన దల్లేవాల్ తిరస్కరించారు.

Read Also: Sania Mirza: కొత్త ప్రయాణం ప్రారంభించిన సానియా మీర్జా!

అయితే, పంజాబ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కారం కింద తగిన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ ఈరోజు (జనవరి 6) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆదివారం జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌ను పటియాలా సీనియర్‌ సూపరింటెండెంట్‌ నానక్‌ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్‌ భార్గవ్‌ మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లాంటి డిమాండ్లతో నవంబర్‌ 26వ తేదీ నుంచి దల్లేవాల్ ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు.

Show comments