ఈ నెల 22న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీ రామ మందిరంపై ఉగ్రదాడి చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్న ప్రచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యపై దాడి చేసేందుకు ఔరంగాబాద్‌లో కుట్ర జరుగుతోందని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పేర్కొంది. అయితే, ఔరంగాబాద్‌లోని 11 మంది అనుమానితులకు చెందిన స్థావాలరాలపై సోదాలు చేసి వారి ఫోన్లను స్వాధీనం చేసుకుంది.
Read Also: Israel: ఇజ్రాయిల్‌పై దక్షిణాఫ్రికా కేసు.. వచ్చే వారం ప్రపంచ న్యాయస్థానంలో విచారణ..
ఇక, అయోధ్యపై దాడికి కుట్ర పన్నుతున్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు రెచ్చగొట్టే ప్రసంగంతో 11 మందిని తమ గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు.. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందే ఈ దారుణానికి పాల్పడేందుకు ప్లాన్ చేశారు. ఈ కుట్ర గురించి ఏటీఎస్ కు సమాచారం రావడంతో నిందితులు పరార్ అయ్యారు. ఈ కుట్రలో పాల్గొన్న మీర్జా సైఫ్ బేగ్, అబ్దుల్ వాహిద్, యాసిర్, జియావుద్దీన్ సిద్ధిఖీ, థోర్ భాన్, ఎస్కే ఖలీద్, తాహిర్, హబీబ్ సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Janhvi Kapoor: రెడ్ డ్రెస్ లో జాన్వీ కపూర్ అందాల హొయలు…
అలాగే, ఈ అనుమానితులందరూ అదృశ్యమయ్యారని యూపీ యాంటీ టెర్రిరిస్ట్ స్వ్కాడ్ కి సమాచారం వచ్చింది. యూపీ ఏటీఎస్ బృందం ఔరంగాబాద్ లో నిందితుల స్థావరాలపై సోదాలు చేసింది. ఔరంగాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఐఎస్‌కు మద్దతుగా పని చేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఇక, నిన్న (బుధవారం) అయోధ్యలో రామ మందిరం గురించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్ట్‌లు పెట్టిన ఝాన్సీకి చెందిన జిబ్రాన్ మక్రానీని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.