NTV Telugu Site icon

Bombay High Court: ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో సె*క్స్ చేసినా అత్యాచారమే..

Bombay High Court

Bombay High Court

Bombay High Court: ఏకాభిప్రాయంతో మైనర్ భార్యతో సెక్స్ చేసిన అది అత్యాచారంగానే పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. అలాంటి చర్యలకు సంబంధించిన చట్టపరమైన రక్షణ చట్టం అంగీకరించదని చెప్పింది. తన భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తికి 10 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్ట్ నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. సమ్మతి వయస్సు 18 ఏళ్లు పైబడి ఉందని పేర్కొంటూ, న్యాయమూర్తి జిఎ సనప్‌తో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగా పరిగణించాల్సిందే అని, ఆమెని వివాహం చేసుకున్నా, లేకున్నా సంబంధం లేదని చెప్పింది.

భార్య లేదా భార్యగా చెప్పబడుతున్న అమ్మాయి వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నప్పుడు భార్యతో ఏకాభిప్రాయ శృంగారం చేశామంటే రక్షణ చట్టాలు అందుబాటులో ఉండవని హైకోర్టు నొక్కి చెప్పింది. కింది కోర్టు విధించిన 10 ఏళ్ల శిక్షను హైకోర్టు సమర్థించింది. కేసు వివరాల ప్రకారం.. వ్యక్తి బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు, ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. అయితే, వీరిద్దరి వివాహ సంబంధం చెడిపోవడంతో భార్య సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసింది.

వారిద్దరి మధ్య పెళ్లి జరిగినప్పటికీ.. ఆ వ్యక్తి ఆమె సమ్మతికి వ్యతిరేకంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు చేసిన ఆరోపణల్ని దృష్టిలో పెట్టుకున్న కోర్టు, అది అత్యాచారం అని పేర్కొంది. ప్రస్తుతం బాధితురాలు మహారాష్ట్ర వార్ధాలో ఆమె తండ్రి, సోదరీమణులు, అమ్మమ్మతో కలిసి నివసిస్తోంది. బాధితురాలు ఈ పరిణామం నుంచి బయటకు వచ్చే సమయానికి ఆమెకు 3-4 ఏళ్లు నిందితుడైన వ్యక్తితో శృంగార సంబంధం ఉంది.

Read Also: Anshul Kamboj: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన అన్షుల్ కాంబోజ్

కుటుంబ పరిస్థితుల కారణంగా సమీపం పట్టణానికి వలస వచ్చిన అమ్మాయిని, నిందితుడు అనుసరించాడు. ఆమెని పికప్ డ్రాప్ చేసేవాడు. చివరకు ఆమెను లైగింకంగా వాడుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. మొదట్లో నిందితుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. నిందితుడు తన ఇరుగుపొరుగు సమక్షంలో అద్దె ఇంటిలో ఆమెకు శ్రీమంతం చేశాడు. ఆ తర్వాత నుంచి అమ్మాయిపై శారీరక దాడులు చేయడం ప్రారంభించాడు. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమెకు పుట్టబోయే బిడ్డ వేరే వ్యక్తి వల్ల కలిగిందని ఆరోపించాడు.

వేధింపులు తట్టుకోలేక బాధితురాలు 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. తమ లైంగిక సంబంధం అంగీకారంతోనే జరిగిందని నిందితుడు ఆరోపించాడు. ఈ కేసులో నేరం జరిగిన సమయంలో బాధితురాలి వయసు 18 ఏళ్ల కన్నా తక్కువగా ఉందని కోర్టు నిర్ధారించింది. డీఎన్ఏ నివేదిక కూడా పుట్టిన బిడ్డ వీరిద్దరికే పుట్టినట్లు కోర్టు నిర్ధారించింది. కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.

Show comments