Site icon NTV Telugu

NTA: ఎన్టీఏ భవనాన్ని ముట్టడించి, లాక్ చేసిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం..

Nta

Nta

NTA: నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీక్స్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూజీసీ-నెట్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) రద్దు చేసింది. పరీక్షా పత్రాలు డార్క్‌వెబ్‌లో లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పేపర్ లీకులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే నీట్ పరీక్షాపత్రం లీక్‌కి సంబంధించి పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఎన్టీఏ నిర్మాణం, పనితీరు, పారదర్శకతపై కేంద్రం కమిటీని నిర్ణయించింది.

Read Also: Pranava East Crest: లగ్జరీ సౌకర్యాలతో ఇల్లు కావాలంటే ఈస్ట్‌ క్రెస్ట్‌ను సందర్శించాల్సిందే..

ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ)కి చెందిన 100 మంది వరకు కార్యకర్తలు ఎన్టీఏ భవనంలోకి దూసుకెళ్లారు.నీట్ పరీక్షల అవకతవకలపై నిరసన తెలిపేందుకు ఢిల్లీ కార్యాలయంలోకి వారంతా వెళ్లారు. కార్యాలయం లోపలి నుంచి లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రవేశ పరీక్షల అవకతవకలతో ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై కేంద్రాన్ని కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఎన్టీఏ కేంద్ర కార్యాలయంలోకి వెళ్లారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మోడీ ప్రభుత్వం ‘పేపర్ లీక్’ ప్రభుత్వమని ఆరోపించింది. దేశంలో నిత్యం పేపర్లు లీక్ అవుతున్నాయని, విద్యా్ర్థులు వీధుల్లో ధర్నాలు చేస్తున్నా, నిరంకుశ మోడీ ప్రభుత్వం మాత్రం ఊరుకోవడం లేదని చెప్పింది. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఈ రోజు విద్యార్థులు తమ గళం విప్పారు. కాంగ్రెస్ రోడ్డు మీద నుంచి పార్లమెంట్ వరకు పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తుతోంది, యువతకు న్యాయం చేస్తామని పేర్కొంది.

Exit mobile version