మహారాష్ట్ర ఎన్నికల వేళ హస్తం పార్టీకి భారీ షాక్ తగిలింది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న రవి రాజా.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. హస్తానికి బై బై చెప్పి కమలం గూటికి చేరారు. దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో రవి రాజా బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి రవి రాజాను బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరే ముందు 44 ఏళ్లు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని రాజీనామాతో రవి రాజా తెంచేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Amaran Special Show: ముఖ్యమంత్రి కోసం ‘అమరన్’ స్పెషల్ షో
రవి రాజా.. ఐదుసార్లు ముంబై నగర కార్పొరేటర్‌గా గెలిచారు. గురువారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్‌తో భేటీ అయ్యారు. దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. చాలా మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు సీనియర్ నేత రవి రాజాను అనుసరించి బీజేపీలోకి వస్తారని జోష్యం చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తిరిగి మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Sangareddy: ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి. ఈసారి ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఒక కూటమి మరోసారి అధికారం కోసం.. ఇంకొక కూటమి అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మరి ఓటర్లు ఏ వైపు ఉన్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Tragedy In Eluru: దీపావళి రోజు విషాదం.. బైక్‌పై టపాసులు తీసుకెళ్తుండగా పేలుడు