కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. మంగళవారం ఈ భేటీ జరగనుంది. జూలై 21 నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల గురించి చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Netanyahu: అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ! ఈ వారంలోనే ప్లాన్ అమలు
ఇక జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షంగా.. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే సూచనలు కనిపిస్తు్న్నాయి. అనేక అంశాలపై ప్రతిపక్ష-అధికార పక్షాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉంది. ఇక బీహార్‌లో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళనలు వ్యక్తపరిచే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌తో పాటు దౌత్యపరమైన చర్యలపై కూడా చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Health Tips: వర్షాకాలం వ్యాధుల కాలం.. ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే.. ప్రమాదంలో పడ్డట్టే!
కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక బృందం సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తదితరులు హాజరుకానున్నారు. దీనికి సోనియా గాంధీ అధ్యక్షతన జనపథ్ నివాసంలో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. ఈ సమావేశాలు ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా.. వారం పాటు పొడిగించారు.
