NTV Telugu Site icon

Congress: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

Congress

Congress

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి హస్తం పార్టీ నేతలు నిరాశ, నిస్పృహలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిమ్మిక్కులు చేసి హర్యానాలో గెలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాకుండా బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. విచారణ జరపాలని కోరింది. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపుపై పార్టీ అభ్యర్థుల ఫిర్యాదులు, ఈవీఎంలలో వ్యత్యాసాలను పరిశీలించేందుకు సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. విచారణ పూర్తయ్యే వరకు ఈవీఎంలకు సీలు వేసి భద్రపరచాలని పార్టీ నేతలు ఈసీని కోరారు. మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, అలాగే ఏఐసీసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అజయ్ మాకెన్, పవన్ ఖేరాలతో కూడిన సీనియర్ నేతల బృందం, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.

ఇది కూడా చదవండి: Ratan Tata family tree: రతన్ టాటా ‘‘వంశ వృక్షం’’ ఇదే.. ఎవరికి టాటా గ్రూప్ దక్కుతుంది..?

అక్టోబర్ 8న హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్లింది. సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ అంతలోనే ఫలితాలు తారుమారు అయ్యాయి. బీజేపీ లీడ్‌లోకి వచ్చి విజయం దిశగా దూసుకెళ్లింది. ఫలితాలు ఒక్కసారిగా తలకిందులవ్వడంతో కాంగ్రెస్ షాక్‌కు గురైంది. 48 స్థానాలతో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఫలితాలను బలవంతంగా లాక్కుందని.. దీన్ని అంగీకరించబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Bangalore: దుకాణదారుడి భార్య ఖాతాలోకి హఠాత్తుగా రూ.999 కోట్లు.. తర్వాత ఏం జరిగింది?