NTV Telugu Site icon

PM Modi: రాహుల్ గాంధీది మావోయిస్టు భాష.. మమతా బెనర్జీవి ఓటు బ్యాంకు రాజకీయాలు..

Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీలపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకపడ్డారు. బెంగాల్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఇద్దరు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. షెహజాదా మావోయిస్టు భాష వాడటం వల్ల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ పారిశ్రామికవేత్త అయిన పెట్టుబడులు పెట్టేందుకు 50 సార్లు ఆలోచిస్తారని అన్నారు. ఆ పార్టీ వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. లోక్‌సభ స్థానాలను తమ పూర్వీకుల ఆస్తులుగా ఆ పార్టీ భావిస్తోందని ఆరోపించారు.

రాహుల్ గాంధీ మావోయిస్టులు మాట్లాడే భాషను ఉపయోగిస్తున్నారని, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు భయపడతారని ప్రధాని అన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీ పారిశ్రామిక వ్యతిరేక వ్యాఖ్యల్ని అంగీకరిస్తారా..? అని ప్రధాని ప్రశ్నించారు.

Read Also: Arvind Kejriwal: ‘‘ఆపరేషన్ ఝాదూ’’.. ఆప్‌ని అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది..

మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఆదివారం మండిపడ్డారు. ఒక వర్గం ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి సామాజిక-మత సంస్థల్ని బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. పురూలియాలో ఈ రోజు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. టీఎంసీ ‘‘ఇస్కాన్, రామకృష్ణ మిషన్ మరియు భారత్ సేవాశ్రమ సంఘానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోంది’’ అని, ఇలా నీచంగా మాట్లాడటం ద్వారా మర్యాద పరిమితులను అతిక్రమించిందని అన్నారు.

ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, రామకృష్ణ మిషన్ మరియు భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బిజెపి నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నారు. దేవాలయాలను చూసుకునే వారు గొప్ప ఆధ్యాత్మిక పనులు చేస్తున్నారు, కానీ కొందరు అలా చేయడం లేదు అని ఆమె అన్నారు.