NTV Telugu Site icon

Nirmala Sitharaman: ప్రజ్వల్ రేవణ్ణపై సాక్ష్యాలు ఉన్నా ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు..

Nirmala Sitaraman

Nirmala Sitaraman

Nirmala Sitharaman: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కర్ణాటకలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రజ్వల్‌తో పాటు అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై మహిళ లైంగిక వేధింపులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో పాటు హసన్ జిల్లాలో ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఏడాది కాలంగా కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వొక్కలిగి ఓట్లు కోల్పోతామనే భయంతోనే కాంగ్రెస్ ఈ పనిచేసిందని అన్నారు. అందుకనే కర్ణాటకలో తొలిదశ ఎంపీ స్థానాలకు ఓటింగ్ అయిపోయేంత వరకు మౌనంగా ఉందని ఆమె అన్నారు.

Read Also: Terrorists Attack: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి..

మహిళకు వ్యతిరేకంగా జరిగే విషయాలను సహించబోమని కేంద్ర హోం మంత్రి స్పష్టంగా తెలియజేశారని, జేడీయూతో పొత్తు ఉన్నప్పటికీ ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు. దీనిపై దర్యాప్తు జరగాలని మేము స్పష్టం చేశామని ఆమె పూణేలో విలేకరులు సమావేశంలో అన్నారు. రేవణ్ణ చర్యలకు సంబంధించిన ఆధారాలు ఉన్న పెన్‌డ్రైవ్‌ని ఓ డ్రైవర్ కాంగ్రెస్‌కి, కర్ణాటక హోంమంత్రికి అందించినట్లు సమాచారం ఉందని, కానీ వారు ఈ సాక్ష్యాలను సుమారు ఏడాది పాటు నొక్కిపెట్టారని, జేడీఎస్ మాతో పొత్తులో ఉన్నందున మమ్మల్ని టార్గెట్ చేశారని అన్నారు. పెన్‌డ్రైవ్‌లో ఏముందో రాష్ట్రమంత్రులకు తెలుసు కానీ మహిళల భద్రతే తమ ప్రాధాన్యత అని భావించడం లేదని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.

వొక్కలిగ వర్గం ఓట్లు పోతాయాని తొలి దశ పోలింగ్ వరకు మౌనంగా ఉండీ, ఇప్పుడు పెద్ద సమస్యగా మార్చి కాంగ్రెస్ తన కపటత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించింది. ఏడాది పాటు ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాల నుంచి ప్రజ్వల్ రేవణ్ణను రప్పించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రధానికి లేఖ రాసిందని, కర్ణాటక ప్రభుత్వం కోరుకున్న అన్ని చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేసినట్లు ఆమె చెప్పారు. బీజేపీ సొంతగా 370 సీట్లు, ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి 400 సీట్లు గెలుచుకుంటుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.