NTV Telugu Site icon

Himanta Biswa Sarma: పాకిస్తాన్, తాలిబాన్‌ల తరహాలోనే కాంగ్రెస్ పార్టీ.. హమాస్ తీర్మానంపై ఆగ్రహం..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: పాలస్తీనాకు మద్దతు ఇస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానంపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటన పాకిస్తాన్, తాలిబాన్ ప్రకటనల్ని పోలి ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై ఎక్స్(ట్విట్టర్)లో విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ కాంగ్రెస్ తీర్మానంలో మూడు పోలికలు ఉన్నాయి. హమాస్‌ని ఖండించలేదు. ఇజ్రాయిల్‌పై దాడుల్ని ఖండించలేదు. బందీలుగా ఉన్న మహిళలు, పిల్లలపై మౌనం’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: NIA: మోస్ట్ వాంటెడ్ ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ రోడ్ ఆస్తులు జప్తు..

బుజ్జగింపు రాజకీయాలకు దేశ ప్రయోజనాలను త్యాగం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని అస్సాం సీఎం ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. పాలస్తీన ప్రజల భూమి, స్వయంపాలన, గౌరవంగా జీవించే హక్కు కోసం దీర్ఘకాలిక మద్దతు ఉంటుందని తీర్మానం చేసింది. ఇజ్రాయిల్ దళాలు, హమాస్ ఉగ్రవాదుల మధ్య తక్షణ కాల్పులు విరమణ కోసం పిలుపునిచ్చింది.

ఈ విషయంపై బీజేపీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన తర్వాత, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఇలాటి వైఖరిని తీసుకున్నారని ఎత్తిచూపింది. భారత్ జోడో యాత్ర సక్సెస్ తర్వాత బీజేపీ కాంగ్రెస్ గురించి మాత్రమే మాట్లాడుతోందని, వాజ్‌పేయి గతంలో చేసిన ప్రసంగాన్ని, తన చరిత్రను మరిచిపోయిందని లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ అన్నారు. హమాస్ తీర్మానంపై కాంగ్రెస్ పార్టీలో విభేదాలు వచ్చాయనే వార్తల్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది.