NTV Telugu Site icon

Raghav Chadha: వింబుల్డన్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఆప్ ఎంపీ దంపతుల ప్రత్యక్షం.. కాంగ్రెస్‌ విమర్శలు

Mpraghavchadha

Mpraghavchadha

ఇండియా కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్‌లో ఆప్ ఎంపీకి సంబంధించిన ఫొటోను పోస్టు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, ఆయ భార్య, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిణీతి చోప్రా తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రూ.8-10 లక్షల ఖరీదైన టికెట్లను కొనుగోలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ దంపతులు వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారని రాఘవ్ చద్దా, చోప్రా ఫొటో పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అయింది. రాగిణి నాయక్.. చోప్రా ఇన్‌స్ట్రాగామ్ నుంచే ఫొటో డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే రాగిణి నాయక్ సోమవారం సాయంత్రం 7 గంటలకు పోస్టు పెట్టిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. అంతలోనే ఆమె ఆ పోస్టును తొలగించేసింది. రాగిణి పోస్టుపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లుగా సమాచారం. మిత్రపక్షాలపై దాడి చేయడం మానుకోవాలని అధిష్టానం హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వెంటనే ఎక్స్ ట్విట్టర్ నుంచి పోస్టు తొలగించింది. కాకపోతే అప్పటికే ఆ పోస్టు వైరల్‌గా మారిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. దీనిపై మిత్రపక్షాలైన ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి పరిణామం చోటుచేసుకుంటుందో చూడాలి.

నటి పరిణీతి చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ‘వింబుల్డన్ ఫైనల్స్, స్ట్రాబెర్రీలు, క్రీమ్, మరియు నా ప్రేమ … ఉత్తమ వీకెండ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఇండియా కూటమిలోని మిత్రపక్షాల విభేదాలపై బీజేపీ స్పందించింది. బీజేపీ నేత షెహజాద్ పూనావల్లా మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసినందున ఆప్, కాంగ్రెస్ మధ్య స్నేహం చెడిందని వ్యాఖ్యానించారు.