Site icon NTV Telugu

Mallikarjun Kharge: ప్రధాని మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. పార్లమెంట్ తసమావేశాన్ని ఏర్పాటు చేయాలని వినతి

Mallikarjunkharge

Mallikarjunkharge

ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు. పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని కోరారు. ఉగ్రవాద దాడుల ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి సమిష్టి సంకల్పాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Vijay Devarakonda : కింగ్‌డ‌మ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిఘా వైఫల్యంపై కేంద్రాన్ని ప్రతిపక్ష నేతల నిలదీశారు. అయితే బైసరన్ లోయ తెరిచిన విషయం తమకు తెలియదని కేంద్రం తెలిపింది. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. ఇక అఖలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ రాకపోవడాన్ని మల్లిఖార్జున ఖర్గే తప్పుపట్టారు. ఇంత సీరియస్ మేటర్ ఉండగా ప్రధాని రాకపోవడం సరికాదన్నారు.

ఇది కూడా చదవండి: UP: దారుణం.. పెళ్లిలో పనీర్ వడ్డించలేదని అతిథులపైకి బస్సు నడిపిన యూపీ వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే..!

Exit mobile version