Site icon NTV Telugu

Congress: కొలిక్కిరాని పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ.. మరోసారి హస్తినకు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Congress: తెలంగాణ పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణ ఇంకా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో భేటీ అయినప్పటికీ స్పష్టత రాలేదు. మరోసారి సోమవారం సమావేశం ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ సమక్షంలో అంతిమ నిర్ణయం ఉండబోతోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవిపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. దీంతో ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలు రాష్ట్రానికి బయలుదేరారు.

Read Also: Fahadh Faasil: ‘పుష్ప’ విలన్ కేసు బుక్.. సుమోటో కేసుగా..?

ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవుల భర్తీపై ఎల్లుండి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పదవుల భర్తీలో అన్ని సామాజికవర్గాలకు సముచిత స్థానం, న్యాయం లభించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. ఎస్సీ మాదిగ, ఎస్టీ, బీసీలకు, ఇతర వెనకబడిన వర్గాలకు సమమైన న్యాయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. పదవుల భర్తీపై పాటించాల్సిన విధివిధానాలపై కేసీ వేణుగోపాల్ నివాసంలో స్థూలంగా చర్చ జరిగింది. ఇప్పటికే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నాయకులకు పదవులివ్వరాదని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన నాయకుల సమ్మతి లేకుండా, సంప్రదించకుండా పార్టీలోకి కొత్తవారిని తీసుకోరాదని, గతంలో కాంగ్రెస్‌లో గెలిచి, బీఆర్ఎస్‌లోకి వెళ్లిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version