కరోనా వ్యాక్సినేషన్‌లో జూన్ 21 వ తేదీనీ ఇండియా ప్రపంచ రికార్డ్‌ను సృష్టించింది. ఉచిత టీకాలను ప్రతిపాదించిన మొదటిరోజే ఇండియాలో 88 లక్షల మందికి టీకాలు వేశారు. అయితే, రెండో రోజు ఆ సంఖ్య 54 లక్షలకు పడిపోయింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. మోడీ ఉంటే ఇలాంటి అద్భుతాలు సాధ్యమే అని, బహుశా ఈ రికార్డ్ కు నోబెల్ బహుమతి ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.
Read: ఆ వ్యాఖ్యలు ఆంధ్రప్రజలను ఉద్దేశించింది కాదు: మంత్రి వేముల
ఆదివారం రోజుల వ్యాక్సిన్‌లను కూడబెట్టి వాటిని సోమవారం రోజున వేశారని, మంగళవారం రోజున యధావిధిగా ఇబ్బందులు మొదలయ్యాయని, ప్రపంచరికార్డ్ వెనుక ఉన్న ఆంతర్యం ఇదేనని చిదంబరం విమర్శలు చేశారు. ఈ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ఆలస్యం కారణంగానే నిన్నటి రోజున వ్యాక్సినేషన్ తగ్గిందని కౌంటర్ ఇచ్చారు.
