ఆ వ్యాఖ్యలు ఆంధ్రప్రజలను ఉద్దేశించింది కాదు: మంత్రి వేముల

ఏపీ నీటి ప్రాజెక్టులు, నాయకులు, ప్రజలపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజ‌ల‌ను ఉద్ధేశించి చేసిన‌వి కాదని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టుల‌తో తెలంగాణ ప్రజ‌లు న‌ష్టపోతార‌నే మా బాధ‌ అని… ఏపీ నేత‌లు ఈ విష‌యాన్ని గుర్తించాలని తెలిపారు. ఎవ‌రిపై ఉద్యమం చేస్తార‌ని సోము వీర్రాజు అంటున్నారని… నీటి వాటాను తేల్చాల‌ని కేంద్రంపై ఉద్యమం చేస్తామని మంత్రి వేముల‌ హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటిని తరలిస్తే ఆనాటి తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ఎవరూ నోరు మెదపలేదని తెలిపారు.

read also : తెలంగాణ మంత్రి వ్యాఖ్యలకు రోజా కౌంటర్

కాగా..నిన్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక మంత్రి అయిఉండి ముఖ్యమంత్రిని గజదొంగ అని వ్యాఖ్యానించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవటం లేదనే విషయం తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల మనుసుల్లో విషం చిమ్మే ప్రయత్నం చేయటం మంచిదికాదని హితవుపలికారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-