NTV Telugu Site icon

Gujarat Elections: ప్రధాని మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు.. రోడ్ షోపై రచ్చ

Pm Narendra Modi

Pm Narendra Modi

Congress objects to Modi’s ‘roadshow’, questions ECI’s silence: గుజరాత్ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఈనెల 8న గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఓటు వేసేందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారని.. నేను దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాని.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అభినందిస్తున్నాని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Read Also: COVID-19: కోవిడ్ “మానవ నిర్మిత వైరస్”.. సంచలన విషయాన్ని వెల్లడించిన సైంటిస్ట్

ఓటు వేసిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు రోడ్ షో చేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మోదీ రోడ్ షో పై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు సైలెంట్ గా ఉంటుందని ప్రశ్నించింది. రెండో దశ పోలింగ్ సమయంలో బీజేపీ ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ, అమిత్ షాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పోలింగ్ రోజు ప్రధాని మోదీ ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రెండున్నర గంటల పాటు రోడ్ షో చేశారని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని.. ఎన్నికల సంఘం ఒత్తడికి గురవుతున్నట్లు కనిపిస్తోందని పవన్ ఖేరా అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరుపున గిరిజన నాయకుడు కాంతి ఖరాడి రక్షణ కోరుతూ ఈసీకి లేఖ రాశారు. అయినా ఈసీ స్పందించలేదు.. ఆ తరువాత అతనిపై బీజేపీ గుండాలు దాడి చేశారని అన్నారు. గుజ్ ప్రాంతంలో మద్యం నిషేధం ఉన్నప్పటికీ బీజేపీ మద్యం పంపిణీ చేసిందని ఆరోపించారు. ఈ రోడ్ షోపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజు ఎన్నికల ప్రచారాన్ని ఈసీ నిషేధించింది. అయితే వారిద్దరికి మాత్రం మినహాయింపులు ఉండవచ్చు అని ప్రధాని మోదీ, అమిత్ షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు దీదీ.