NTV Telugu Site icon

INDIA bloc: మేమంతా కలిసే ఉన్నాం, లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ వస్తాం..

India Bloc

India Bloc

INDIA bloc: ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ పరాజయం, కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేశాయి. కూటమిలోని ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక పోవడంతోనే అధికారం కోల్పోయాయని మిత్రపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, అనుమానాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో చీలికలు ఉన్నాయనే వాదనల్ని తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, మళ్లీ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కలిసి వస్తాయని అన్నారు.

Read Also: Asteroid: భూమికి ప్రమాదం.. గ్రహశకలం ఢీకొట్టే అవకాశం..

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని, రాష్ట్ర స్థాయి ఎన్ని్కల్లో పోటీలకు ప్రతీ పార్టీ సొంతగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉందని శుక్లా చెప్పారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత చెక్కుచెదరలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసి ఆప్ ఓట్లను చీల్చిందనే వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. ప్రతీ ఎన్నికల్లో ఓట్ల విభజన జరుగుతుందని చెప్పారు.

తాజాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 10 ఏళ్ల ఆప్ అధికారానికి బ్రేక్ వేసింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిస్తే, ఆప్ 22 సీట్లను కైవసం చేసుకుంది. 67 చోట్ల కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.