NTV Telugu Site icon

Jairam Ramesh: బీజేపీ జిమ్మిక్కు చేసి హర్యానా ఫలితాలను మార్చేసింది

Jairamramesh

Jairamramesh

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఫలితాలను తాము అంగీకరించడం లేదని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. హర్యానా ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హర్యానా ఫలితాలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. మూడు జిల్లాల నుంచి చాలా సీరియస్‌గా ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా హర్యానా ఫలితాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఫలితాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని వెల్లడించారు. బీజేపీ ఫలితాలను తారుమారు చేసి విజయాన్ని సాధించిందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Black magic: బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామను చంపేందుకు కోడలు కుట్ర..

ఇక జమ్మూకాశ్మీర్‌లో ప్రజలు స్పష్టమైన విజయాన్ని ఇచ్చారని జైరాం రమేష్ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నం చేసిందన్నారు. ఇక్కడ ప్రజలు కూటమికి స్పష్టమైన తీర్పు ఇచ్చారని జైరాం రమేష్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Shah Rukh Khan: మళ్ళీ ‘3’పై కన్నేసిన షారుఖ్ ఖాన్

మంగళవారం హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే రెండు చోట్ల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. హర్యానాలో అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ ముందంజలో కనిపించింది. అనంతరం కొద్ది నిమిషాల్లోనే కమలం పార్టీ దూసుకొచ్చింది. హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, కాంగ్రెస్ 37 స్థానాలు కైవసం చేసుకున్నాయి.

Show comments