ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. మరి వారు బాధ్యతను మరిచి వివాదాల జోలికి వెళ్తున్నారా… లేదంటే తాము లైమ్‌లైట్‌లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా అనే విషయం దేవుడికే తెలియాలి. తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి, కాంగ్రెస్ నేత రోడ్లను ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో పోల్చారు. రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ రెండు రోజుల కిందట క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రసింగ్ గూడా అనే కాంగ్రెస్ నేతకు మంత్రి పదవి దక్కింది. అయితే మంత్రి పదవి వచ్చి ఒక్కరోజు కాకుండానే ఆయన బాధ్యత మరిచి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: పెళ్లింట విషాదం..రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజేంద్రసింగ్ గూడా బుధవారం నాడు తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన సమావేశం కాగా.. కొందరు ప్రజలు రోడ్లు బాగుచేయించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాజేంద్రసింగ్.. తన నియోజకవర్గంలో రోడ్లు కత్రినాకైఫ్ బుగ్గల్లా ఉండాలంటూ వ్యాఖ్యానించారు. దీంతో క్షణాల్లోనే ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి సరదాగా ఈ వ్యాఖ్యలు చేసినా… ఇలాంటివి సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
