NTV Telugu Site icon

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. కొత్త వివాదానికి తెర లేపిన శ్యామ్ పిట్రోడా

Pritoda

Pritoda

Sam Pitroda: కాంగ్రెస్‌ పార్టీ ఓవర్సీస్‌ ఛైర్మన్‌ శ్యామ్ పిట్రోడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీ వైఖరికి భిన్నమైన వాదనలను అతడు వినిపించారు. చైనాను భారత్ శత్రువులా చూడొద్దని తెలిపాడు. డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందన్నాడు. ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. ఇకనైనా భారత్‌ తన పద్దతి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం ఆపేయాలని సూచించారు. తొలి నుంచి చైనాతో భారత్‌ అనుసరిస్తున్న ఘర్షణాత్మక పద్దతి వల్ల ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతుందని శామ్‌ పిట్రోడా చెప్పుకొచ్చాడు.

Read Also: Suchir Balaji: అమెరికా పోలీసులు సంచలన నిర్ణయం.. సుచిర్ బాలాజీ కేసు మూసివేత

ఇక, చైనా పట్ల భారతదేశ వైఖరి మొదటి రోజు నుంచి ఘర్షణాత్మకంగానే కొనసాగుతుందని శ్యామ్ ప్రిటోడా తెలిపారు. మనం అవలంబిస్తున్న ఈ విధానంతో దేశానికి కొత్త శత్రువులు ఏర్పాడుతున్నారు.. భారత్‌కు సరైన మద్దతు దక్కడం లేదన్నారు. ఇప్పటికైనా ఇండియా తన వైఖరిని మార్చుకోవాలి.. ఇది కేవలం ఒక డ్రాగన్ కంట్రీ విషయంలోనే కాదు.. ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని హెచ్చరించాడు. అయినా చైనా నుంచి ఏం ముప్పుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.. అమెరికా చైనాను తరచూ శత్రువుగా చూస్తుంది.. అదే బాటలో భారత్ కూడా పోతుందని శ్యామ్ ప్రిటోడా ఆరోపించారు.