Punjab: పంజాబ్‌లో కాంగ్రెస్ నేత హత్య.. తామే చంపామన్న ఖలిస్తానీ ఉగ్రవాది..
Punjab: ఖలిస్తానీ ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాలో సోమవారం స్థానికి కాంగ్రెస్ నాయకుడిని తన నివాసంలో కాల్చి చంపారు. బల్జీందర్ సింగ్ బల్లి అనే కాంగ్రెస్ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మొత్తం దాలా గ్రామంలోని బల్లి నివాసంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇతను అజిత్వాల్ లోని కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
Read Also: Canada: భారత్‌పై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు.. ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకు భారత దౌత్యవేత్త బహిష్కరణ
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
అయితే ఈ హత్యకు కెనడాకు చెందిన ఖలిస్తాన్ ఉగ్రవాది అర్ష్ డల్లా బాధ్యత తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ పేజీలో పోస్టు పెట్టాడు. బల్జిందర్ సింగ్ బల్లి తనను గ్యాంగ్‌స్టర్ సంస్కృతిలోకి నెట్టాడని డల్లా తన పోస్ట్‌లో ఆరోపించారు. తన తల్లి పోలీసు కస్టడీ వెనుక కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, ఇది ప్రతీకారం తీర్చుకునేలా ప్రేరేపించిందని ఆయన పేర్కొన్నారు. అర్ష్ డల్లా టెర్రరిస్టుగా భారత్ చేత గుర్తించబడ్డాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అతని కోసం వెతుకుతోంది. గత మూడు నాలుగేళ్లుగా అతను కెనడా కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. పంజాబ్ లో జరిగిన పలు హత్యలకు ఇతనితో సంబంధాలు ఉన్నాయి.
హత్య జరిగే సమయంలో బల్జిందర్ సింగ్ తన ఇంట్లో హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు, ఏవో పత్రాలపై సంతకాలు చేయాలని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అభ్యర్థన రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు బల్లిపై కాల్పులు జరిపి హతమార్చారు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?