NTV Telugu Site icon

Sam Pitroda: కేంద్రానికి శామ్ పిట్రోడా కౌంటర్.. ఆ ప్రకటనను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత

Sampitroda

Sampitroda

కేంద్రం-కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మరోసారి కేంద్రానికి పిట్రోడా కౌంటర్ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ చేసిన ప్రకటనను తోసిపుచ్చారు. ఫిబ్రవరి 1న ఐఐటీ-రాంచీ విద్యార్థులు, అధ్యాపకులతో వర్చువల్‌గా శామ్ పిట్రోడా ప్రసంగిస్తున్నారు. హఠాత్తుగా వెట్‌కాస్ట్‌లో అశ్లీల వీడియోలు ప్లే అయిపోయాయి. దీంతో షాక్ తిన్న శామ్ పిట్రోడా వెంటనే ప్రసంగాన్ని నిలిపేశారు. ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన వెబ్‌కాస్ట్‌ను కేంద్రం హాక్ చేసి అశ్లీల వీడియో ప్రదర్శించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది న్యాయమా?, దేశంలో ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని పిట్రోడా ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: SLBC Tunnel Collapse: భయంగా ఉంది.. సొంతూర్లకి ఎస్‌ఎల్‌బీసీ కార్మికులు!

ఇక పిట్రోడా ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ తక్షణమే స్పందించింది. అసలు ఐఐటీ రాంచీ అనేదే ఉనికిలో లేదని.. అలాంటిది హ్యాక్ చేయడం ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేసింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం మానుకోవాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయినా పిట్రోడాకు భౌతికంగా లేదా వర్చువల్‌గా ఉపన్యాసం చేయడానికి ఇన్‌స్టిట్యూట్ ఏ కాన్ఫరెన్స్/సెమినార్‌కు ఆహ్వానించలేదని ఐఐఐటీ రాంచీ ధృవీకరించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఐటీల ఖ్యాతి అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తల కృషి, సాధనపై నిర్మించబడిందని పేర్కొంది. ప్రముఖ సంస్థలను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: IITA Passing Out Parade: ఐఐటీఏలో డాగ్ స్క్వాడ్ పాసింగ్ అవుట్ పరేడ్.. డీజీకి పూలబొకే ఇచ్చిన జాగిలం!

తాజాగా శామ్ పిట్రోడా కేంద్రం ఆరోపణలను తోసిపుచ్చారు. తనకు ఐఐటీ-రాంచీ నుంచి ఆహ్వానం ఉందని.. ఆహ్వానం మేరకే జూమ్ లింక్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసగించినట్లు శామ్ పిట్రోడా స్పష్టం చేశారు.