NTV Telugu Site icon

Karnataka: ఆడియో-వీడియోలతో మాజీ మంత్రిని బ్లాక్‌మెయిల్‌ చేసిన కాంగ్రెస్ నాయకురాలు..

Blackmailing ,

Blackmailing ,

Karnataka: కర్ణాటకకు చెందిన మహిళా నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌‌తో గత కొంత కాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజులా అనే మహిళ, ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది.

బ్లాక్‌మెయిల్, దోపిడికి పాల్పడిన కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కలబురిగిలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మంజులా పాటిల్, ఆమె భర్త శివరాజ్ పాటిల్‌ని అరెస్ట్ చేసింది. ఈ జంట కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌ని బ్లాక్‌మెయిల్ చేశారు. చాలా ఏళ్లుగా సదరు మహిళ మంజుల, గుత్తేదార్‌తో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తన పదవిని ఉపయోగించుకున్నట్లు సమాచారం. చాలా కాలంగా వీరి మధ్య సాగుతున్న మాటల్ని, వీడియో కాల్స్‌ని మంజుల రికార్డ్ చేసింది. మంజులకు సంబంధించిన ఫోన్లో ఇతర వ్యక్తులకు చెందిన వివరాలు కూడా ఉన్నాయి. దీంతో దర్యాప్తు పరిధిని పెంచాలని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: IND vs NZ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందే జట్టులోకి యువ ఆటగాడు ఎంట్రీ..

మంజుల, శివరాజ్ తమ అరెస్ట్‌కి రెండు రోజుల ముందు బెంగళూర్‌లో డబ్బుల కోసం గుత్తేదార్ కుమారుడు రితేష్‌ని సంప్రదించారు. రితేష్ అధికారిక ఫిర్యాదుతో పోలీసులు శనివారం గరుడా మాల్‌లో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని కోర్టులో హాజరుపరిచి, 8 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.

నలపాడ్ బ్రిగేడ్ అధ్యక్షురాలిగా ఉన్న మంజుల, గుత్తేదార్ తనకు అసభ్యకరమైన వీడియోలు పంపాడని ఆయన కొడుకు రితేష్‌ని కలిసింది. మీడియాకు ఈ వివరాలు వెల్లడించకుండా ఉండాలంటే రూ. 20 లక్షల్ని డిమాండ్ చేసింది. మంజుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు స్మార్ట్‌ఫోన్‌లలో జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు, పోలీసు అధికారి మరియు పీడబ్ల్యూడీ అధికారితో సహా కనీసం ఎనిమిది మంది వ్యక్తుల సెన్సిటివ్ వీడియోలు ఉన్నాయి.