NTV Telugu Site icon

Himanta Biswa Sarma: ఒక్కదానికే కాంగ్రెస్ ఇంత ఓవరాక్షనా..? ఇటువంటివి మేం మస్త్ చూసినం..

Himata Biswa Sarma

Himata Biswa Sarma

Himanta Biswa Sarma: కాంగ్రెస్ గెలుపుపై బీజేపీయేతర విపక్షాలు అభినందనలు తెలియజేస్తున్నారు. కొందరు విపక్షాల ఐక్యతకు ఇదే మంచి సమయం అని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా అందులో చేరాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం ఈ విషయం దేశంపై ప్రభావం చూపించదని.. 2024 లోక్ సభ ఎన్నికలపై దీని ఎఫెక్ట్ ఉండదని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.

Read Also: BJP: మరేం పర్వాలేదు.. కర్ణాటకలో ఓడినా బీజేపీ ఆనందమే.. కారణం ఇదే..

తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చి అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి కాంగ్రెస్ విజయంపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక రాష్ట్రంలో గెలిచినందకే చాలా ఓవరాక్షన్ చేస్తుందని.. మేము అనేక రాష్ట్రాల్లో గెలిచామని ఎప్పుడూ అతిగా స్పందించలేదని ఆయన అన్నారు. సచిన్ టెండూల్కర్ సాధారణంగా డబుల్ సెంచరీ చేస్తాడు.. కానీ కొన్ని సార్లు జీరోకి కూడా ఔట్ అవుతాడంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు.

కర్ణాటక ఫలితాలు సార్వత్రిక ఎన్నిలకపై ఎలాంటి ప్రభావం చూపించవని.. 2024లో కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని అంతకుముందు శనివారం బిశ్వసర్మ అన్నారు. కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రంలో, కర్ణాటకలో అధికారంలోకి రావడం కొత్త కాదని, 2014 ఎన్నికలకు ముందు కూడా అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. కర్ణాటకలో ఓటమిని అంగీకరిస్తున్నామని, కారణాలను సమీక్షించుకుంటామని, ఓడిపోయినందుకు ఈవీఎంలను తప్పుబట్టడం లేదని విపక్షాలకు చురకలు అంటించారు.