Site icon NTV Telugu

Om Birla: స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు

Om Birla

Om Birla

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. సెక్షన్ 94C కింద స్పీకర్‌ను తొలగించాలంటూ నోటీసు ఇచ్చింది. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు 103 ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును కాంగ్రెస్ అందజేసింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంతో సభ మొదలైంది. అప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జాతీయవాదంపై మాట్లాడుతూ.. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ప్రస్తావించారు. దీంతో స్పీకర్ అడ్డుకున్నారు. మైక్ కట్ చేయడంతో రభస మొదలైంది. అలాగే కేంద్రమంత్రులు అడ్డుతగిలారు.

ఇది కూడా చదవండి: Lok sabha: వెలుగులోకి విపక్ష మహిళా ఎంపీల మరో వీడియో.. కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!

ఇక ఫిబ్రవరి 4న కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని మోడీపై దాడి చేసేందుకు కుట్ర చేశారని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దీనిపై విపక్ష నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తు్న్నారని.. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్‌పై విపక్షం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్‌పై దుమారం.. రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version