Site icon NTV Telugu

Shashi Tharoor: శశిథరూర్‌ తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ అసహనం!

Shashitharoor

Shashitharoor

సొంత పార్టీలో ఉంటూ.. కాంగ్రెస్‌పై విమర్శలు.. బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్న ఎంపీ శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటినట్లుగా హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీ వర్గాల అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాకిస్థా్న్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ పరిణామం తర్వాత వరుసగా మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలో శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Rekha Gupta: కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, శశిథరూర్‌, ప్రియాంక గాంధీ, సచిన్‌ పైలట్‌ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ వర్గాలు శశిథరూర్‌పై కీలక వ్యా్ఖ్యలు చేశాయి. శశిథరూర్ ఈసారి లక్ష్మణ రేఖ దాటారని.. పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. జైరాం రమేష్ స్పందిస్తూ.. శశిథరూర్ వ్యాఖ్యలు పార్టీకి ఎలాంటి సంబంధం లేవని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Off The Record: ఏపీ బీజేపీ నేతల్లో ఉన్నట్టుండి నైరాశ్యం..?

Exit mobile version