Congress: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షనేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక.. బలపరిచిన టీడీపీ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సత్తా చాటింది. అయితే, గతంలో పోలిస్తే మాత్రం సీట్లలో భారీగా కోత పడింది. 2014, 2019ల్లో మెజారిటీ మార్క్ 272ని దాటి బీజేపీ సీట్లను కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి మాత్రం 240 స్థానాలకు మాత్రమే పరిమితమై సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఎన్డీయే కూటమి మొత్తంగా 292 సీట్లను గెలుచుకుంది. ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
మరోవైపు గతంలో పోలిస్తే ప్రతిపక్ష కూటమి బాగా పుంజుకుంది. మొత్తంగా 234 సీట్లను కైవసం చేసుకుని, మెజారిటీ మార్కుకు దగ్గరగా ఆగిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీకి బ్రేకులు వేసింది. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో సత్తా చాటింది. అయితే, బీజేపీని మాత్రం అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయింది. 10 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా ఎన్డీయే అధికారాన్ని ఏర్పాటు చేస్తోంది.
Read Also: Mobile Heating: మీ మొబైల్ హీట్ అవుతుందా.. ఇలా చేసి చూడండి..
ఈసారి కాంగ్రెస్ గతంతో పోలిస్తే చాలా మెరుగైంది. గత రెండు సందర్భాల్లో కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లను కూడా సంపాదించుకోలేని ఆ పార్టీ ఈ సారి 100కి చేరువలో అంటే 99 సీట్లను కైవసం చేసుకుంది. 2019లో 52 సీట్ల నుంచి ఈ సారి 99 సీట్లను సాధించింది. అయితే, కాంగ్రెస్ పుంజుకున్న మాట వాస్తమే అయినప్పటికీ, అధికారంలోకి రావడానికి మాత్రం ఈ నెంబర్ సరిపోదు. కాంగ్రెస్ 120 నుంచి 130 సీట్లు వస్తేనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మూడు కీలకమైన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పార్టీ తన పనితీరు మెరుగుపరుచుకోకుంటే అధికారం అనేది సాధ్యం కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ ఎంపీ సీట్లను మాత్రం స్వీప్ చేయలేకపోతోంది. ప్రభుత్వం ఉన్నా కూడా దాని ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. ఇక మరోవైపు బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హిమచల్, ఉత్తరాఖండ్, హర్యానా వంటి హిందీ హార్ట్ ల్యాండ్ మొదటి నుంచి అండగా ఉంటున్నాయి. ఈ ఎన్నికల్లో పలు సంఘటనలు, స్వీయ తప్పిదాలు బీజేపీ సీట్ల తగ్గింపుకు కారణమైంది. అయినా కూడా ఈ రాష్ట్రాల్లో బీజేపీకి సంస్థాగతంగా, గ్రాస్ రూల్ లెవల్‌లో బలం ఉంది.