Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
- 2027 యూపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కొత్త రాజకీయ వ్యూహం.
- చంద్రశేఖర్ ఆజాద్, అసదుద్దీన్ ఒవైసీలతో పొత్తుకు ప్లాన్.
- బీజేపీని ఒంటరిగా ఓడించలేమన్న కాంగ్రెస్ ఎంపీ.
- ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల్లో విభేదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుల చర్చలు మొదలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కలిసి పోటీ చేయాలని భావించాయి. అయితే, సీట్ల పంపకాలపై చర్చలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో కొత్త పొత్తుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్, అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎంఐఎంతో, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్‌తో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఓవైసీ, చంద్రశేఖర్ అజాద్ తన స్నేహితులుగా అభివర్ణించారు. యూపీలో బీజేపీని ఎవరూ ఒంటరిగా ఓడించలేరని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ మద్దతు లేకుండా బీజేపీని ఎవరూ ఓడించలేరని చెప్పారు. కొత్త పొత్తుల గురించి కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. యూపీలో ఓవైపు ఎస్పీ మద్దతు వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేనప్పటికీ, మరోవైపు ఓవైసీ, ఆజాద్‌లను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓవైసీని తన అన్నయ్యగా మసూద్ పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మాత్రం ఎంఐఎంను బీజేపీ బీ-టీమ్ అని ఆరోపిస్తోంది.
Also Read
- Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
- Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్‌ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
అఖిలేష్‌పై ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇలా మాట్లాడుతున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పటికే ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపిణీ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సీట్ల విషయంలో అఖిలేష్ యాదవ్ పార్టీపై మరింత ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తుందనే ఆరోపణ కూడా ఉంది. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ రెండింటికి ప్రధాన ఓటు బ్యాంక్ ముస్లింలే. విడివిడిగా పోటీ చేస్తే ఈ ఓట్లు చీలుతాయి. ఈ నేపథ్యంలో ఎస్పీని దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ఈ ఎత్తుగడను వాడుకుంటుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
R Ashwin: ఉన్నపళంగా ఇంటికి పోలీసులు.. షాక్‌కు గురైన అశ్విన్.. అసలు కారణం ఇదే!
-
SBI Clerk Recruitment 2026: ఎస్బీఐలో 9,124 క్లర్క్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, పరీక్ష వివరాలు
-
Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
-
Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
ట్రెండింగ్
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!