Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
- ఉత్తర్ ప్రదేశ్‌లో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
- సమాజ్‌వాదీ, కాంగ్రెస్ మధ్య పొత్తు పంచాయతీ..
- చర్చలకు ప్రియాంకా గాంధీ సారధ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్‌ల మధ్య పొత్తు పంచాయతీ ఏర్పడింది. కాంగ్రెస్ 125 స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు 50 స్థానాలే ఎక్కువ అని ఆ ఎస్పీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీట్ల పంపకాలపై చర్చలను ముందుండి నడిపించే బాధ్యతను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రియాంకా గాంధీకి అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ సోమవారం యూపీ కాంగ్రెస్ నేతలతో సుమారు 3 గంటల పాటు సమావేశయ్యారు. ఈ సమావేశాల్లో 175 స్థానాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ 100 స్థానాలతో ఓ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వారం మరోసారి ప్రియాంకా గాంధీ యూపీ నేతలతో భేటీ కానున్నారు. దీని తర్వాత ఎస్పీకి 125 నుంచి 150 స్థానాలో కూడిన ప్రతిపాదన జాబితాను అందించనున్నారు.
Also Read
- Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
- Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
- Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
- Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
2024 లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఫలితాల అధారంగా సీట్ల ఎంపిక చేయనున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పొత్తులో 17 ఎంపీ సీట్లు కేటాయిస్తే, 06 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 38 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించగా, మరో 42 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ 80 స్థానాలను కాంగ్రెస్ తన జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇక అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలను కూడా కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేకపోతోంది.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ 125 నుంచి 150 స్థానాలు కోరుతుంటే, ఎస్పీ మాత్రం కాంగ్రెస్‌కు 60-65 స్థానాలకు మించి కేటాయించేందుకు ఇష్టపడటం లేదు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పదే పదే చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 403 స్థానాలు ఉంటే సుమారు 350 చోట్ల తామే పోటీ చేయాలని అఖిలేష్ భావిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
-
MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
-
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. ఆదేశాలు ధిక్కరిస్తే అంతే..
-
Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!