Site icon NTV Telugu

PM Modi: కాంగ్రెస్ ఆవు పేడను కూడా వదల్లేదు..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. శనివారం మోదీ బిలాస్‌పూర్ లో నిర్వహించిన మహాసంకల్ప్ ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం భూపేష్ బాఘేట్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంలో అవినీతికి పాల్పడిందని, ఆవుపేడను కూడా వదిలిపెట్టలేదని, రాష్ట్రంలో పేడ సేకరణ పథకం గురించి ఆరోపించారు.

Read Also: Rs.2000 note exchange: రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు.. ప్రకటించిన ఆర్బీఐ

బీజేపీ హామీ ఇచ్చిన విధంగా మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే మహిళా బిల్లును తీసుకువచ్చామని, 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారని మోడీ అన్నారు. మహిళలంతా మోడీకి మద్దతుగా నిలుస్తారని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కోపంతో ఉన్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు.

మహిళలను కులాల వారీగా విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని, రాబోయే వెయ్యి ఏళ్లపై ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో మహిళలు వారి ఉచ్చులో పడొద్దని మోడీ కోరారు. దళితులు,ఎస్టీలు, బీసీలు ఎదుగుతుండటం చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని, మోడీని లక్ష్యంగా చేసుకుని ఓబీసీలను టార్గెట్ చేస్తోందని అన్నారు. చత్తీస్ గఢ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి పక్కా ఇల్లు నిర్మిస్తామని కేబినెట్ తొలి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Exit mobile version