NTV Telugu Site icon

Indigo Flight Incident: విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచిన బీజేపీ నేత తేజస్వీ సూర్య.. కాంగ్రెస్ ఆరోపణలు..

Indigo Flight Incident

Indigo Flight Incident

Congress claims Tejasvi Surya opened emergency exit on IndiGo flight: బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు, బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య చిక్కుల్లో ఇరుకున్నారు. గత నెలలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం, డిసెంబరు 10న, చెన్నై నుండి తిరుచిరాపల్లికి వెళ్లే ఇండిగో 6ఈ ఫ్లైట్ 6ఈ-7339 నేలపై ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచినట్లు తెలిపింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఆ తరువాత విమానంలో ప్రెషర్ తనిఖీలు చేసిన తర్వాత గాల్లోకి ఎగిరింది. దీంతో ఫ్లైట్ ఆలస్యం అయింది. ఈ ఘటనపై ప్రయాణికుడు క్షమాపణలు చెప్పినట్లు ఇండిగో వెల్లడించింది.

Read Also: Off The Record: బీజేపీలో ముగ్గురు నేతల మూడుముక్కలాట

అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్ లాక్ చేసింది బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అని విమానంలో ఇతర ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు బీజేపీ, తేజస్వీ సూర్యపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ సమయంలో తేజస్వీ సూర్యతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఫ్లైట్ లో ఉన్నారు. ‘బీజేపీ వీఐపీ ఆకతాయిలు’ అంటూ కాంగ్రెస్ విమర్శించింది.

ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసింది ఎవరో కాదు, ఆ నిందితుడు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను అన్‌లాక్ చేసిన ప్రయాణీకుడు బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుండి మొదటిసారిగా గెలుపొందిన ఎంపీ అని ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై తేజస్వీ సూర్య నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.