NTV Telugu Site icon

Siddaramaiah: ఎగ్జిట్ పోల్స్‌పై నమ్మకం లేదు.. శనివారం ఫలితాలు వేరేగా ఉంటాయి

Siddaramaiah

Siddaramaiah

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరిగాయి. అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని సర్వేల్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయమని తేల్చాయి. అయితే ఈ సర్వేలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌ను తాను నమ్మడం లేదని తేల్చిచెప్పారు. హర్యానా ఎన్నికల్లో సర్వేల అంచనాలు తప్పాయని గుర్తుచేశారు. మరొకసారి అంచనాలు తప్పవుతాయని చెప్పారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయంతో పాటు సండూర్‌, షిగ్గాన్‌, చెన్నపట్న అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధిస్తుందని సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Pakistan: చైనా కోసం.. బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి విడత నవంబర్ 13న 43 స్థానాలకు.. నవంబర్ 20న 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23(శనివారం) విడుదలకానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి దెబ్బాదెబ్బగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా పోటీపడ్డాయి. మరోసారి మహారాష్ట్రలో అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది.

ఇది కూడా చదవండి: Koti Deepotsavam 2024 Day 13: కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి.. ఘనంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం