Site icon NTV Telugu

Supreme Court: ‘‘SIR ఎన్నికల సంఘం ప్రత్యేక హక్కు’’.. సుప్రీంలో విపక్షాలకు ఎదురుదెబ్బ..

Sir

Sir

Supreme Court: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సుప్రీంకోర్టులో విపక్షాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ కార్యక్రమం ద్వారా ఫేక్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్యను కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంని ఆశ్రయించాయి. మంగళవారం దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం..‘‘ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించడం ఎన్నికల కమిషన్ యొక్క ప్రత్యేక హక్కు. ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే అది వారి విధుల్లో జోక్యం చేసుకోవడమే’’ అని న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఐదు రాష్ట్రాల్లో సర్ ఎప్పుడు నిర్వహిస్తున్నారో తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరిన తర్వాత, ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత 3.66 లక్షల ఓటర్ల తొలగింపులు, 21 లక్షల మంది ఓటర్ల చేరికలకు సంబంధించిన డేటాను సేకరించి నోట్ సిద్ధం చేయాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది.

Read Also: Ponnur Murder: సోదరి ప్రేమ వివాహం.. యువకుడిని దారుణంగా హత్య చేసిన సోదరుడు!

అయితే, SIR ప్రక్రియను సవాలును చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదిస్తున్న కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన లక్షల మందికి తెలియజేయలేదని అన్నారు. ఎన్నికల సంఘం తరుపున హాజరైన న్యాయవాది రాకేష్ ద్వివేది మాట్లాడుతూ.. పేర్లు తొలగించబడిన వ్యక్తులకు దాని గురించి సమాచారం అందించినట్లు చెప్పారు. ముసాయిదా, తుది జాబితాలను రాజకీయ పార్టీలకు అందించటన్లు సుప్రీంకోర్టుకు తెలిపారు.

అత్యున్నత న్యాయస్థానం సర్ ప్రక్రియపై ఇచ్చిన తీర్పు, ఎన్నికల సంఘానికి విజయంగా భావించవచ్చు. ఈ ప్రక్రియను కాంగ్రెస్, ఆర్జేడీ తప్పుపట్టాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ, ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నాయని పెద్ద ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు విపక్షాలకు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణించవచ్చు. సోమవారం బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్ రిలీజ్ అయింది. నవంబర్ 6, 11 ఎన్నికలు జరిగితే, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.

Exit mobile version